మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా పనులు ఎక్కడెక్కడ చేయాల్లో స్థలాలను గుర్తించారు. నర్సాపూర్ మండలానికి గాను దాదాపు రూ. 5.28 కోట్లు నిధులు మంజూరయ్యాయని డీఆర్‌డీవో సీతారామరావు తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అహ్మద్‌నగర్ గ్రామంలో పనుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్థులు ఆరోపించారు. డీఆర్‌పీ నివేదిక ఆధారంగా విచారణ జరిపారు. అవకతవకలు జరగడం వాస్తవేమనని తేల్చి క్షేత్రసహాయకున్ని విధుల్లో నుంచి తప్పించారు. కొందరికి జరిమాన విధించగా... మరికొందరి నుంచి డబ్బుల వసూలు చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!