ETV Bharat / state

ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగిన నామినేషన్లు

author img

By

Published : Jan 9, 2020, 11:20 AM IST

ఉమ్మడి మెదక్​ జిల్లాలో బుధవారం పురపాలక నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మున్సిపల్​ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్​ వేసే అభ్యర్థి వెంట కేవలం ఐదుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 165 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా 91 నామినేషన్లు దాఖలవగా.. కనిష్ఠంగా సిద్దిపేట జిల్లాలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి.

Joint Medak District-wide nominations  Stretched down
ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగిన నామినేషన్లు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ వి. నాగిరెడ్డి మంగళవారం పురపాలక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయడంతో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి రోజు నామినేషన్లు జోరుగా సాగాయి.

మెదక్​ జిల్లాలో మొత్తం నాలుగు పురపాలక సంఘాలు ఉండగా.. మొదటి రోజు 42 నామినేషన్లు దాఖలయ్యాయి. గరిష్ఠంగా నర్సాపూర్​లో 21, కనిష్ఠంగా రామాయంపేటలో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా పట్టణాల వారీగా.. మెదక్​లో 14, రామాయంపేటలో 2, నర్సాపూర్​లో 21, తూప్రాన్​లో 5 నామినేషన్లు దాఖలయ్యాయి.

సిద్దిపేటలో...

సిద్దిపేట జిల్లాలో మొత్తం 5 పురపాలక సంఘాలు ఉండగా.. సిద్దిపేట పాలక మండలి గడువు ఉండటం వల్ల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మిగిలిన నాలుగు పట్టణాల్లో మొదటి రోజు 32 నామినేషన్లు దాఖలు చేశారు. గరిష్ఠంగా హుస్నాబాద్​లో 17, కనిష్ఠంగా గజ్వేల్​లో 3 నామినేషన్లు వేశారు. ఆయా పట్టణాల వారీగా.. హుస్నాబాద్​లో 17, చేర్యాలలో 4, దుబ్బాకలో 8, గజ్వేల్​లో 3 నామినేషన్లు దాఖలయ్యాయి.

సంగారెడ్డిలో...

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 పురపాలక సంఘాలు ఉండగా.. కోర్టులో కేసు ఉండటం వల్ల జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. మిగిలిన 7 పట్టణాల్లో మొదటి రోజు మొత్తం 91 నామినేషన్లు దాఖలు చేశారు. గరిష్ఠంగా సంగారెడ్డిలో 27, కనిష్ఠంగా నారాయణఖేడ్​లో 1 నామినేషన్ వేశారు. ఆయా పట్టణాల వారీగా.. అమీన్​పూర్​లో 20, ఐడీఏ బొల్లారంలో 9, తెల్లాపూర్​లో 4, సంగారెడ్డిలో 27, సదాశివపేటలో 20, ఆందోల్-జోగిపేటలో 10, నారాయణఖేడ్​లో 1 నామినేషన్ దాఖలయ్యాయి.

ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'

Intro:tg_srd_22_08_munciple nominations_vis_ts10100
etv contributor: rajkumar raju, center narealize medak dist
మెదక్ జిల్లా నర్సాపూర్ పురపలికలో మొదటి రోజు నామినేషన్స్ 21 దాఖలు చేశారు. తెరాస 15, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్ధులు 4 ఉన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. కేవలం 5 గురిని మాత్రమే లోపలకు అనుమతి ఇస్తున్నారు. అభ్యర్థులు సాదా సీడగా వచ్చి నామినేషన్లు వేస్తున్నారు.

Body:body

Conclusion:8008573221

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.