ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాత బస్టాండ్ నుంచి ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినా.. నిధులు కేటాయించలేదన్నారు. 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే