ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
సంగారెడ్డి జిల్లా పరిధిలో 32,138, మెదక్ జిల్లాలో 15,598, సిద్దిపేట జిల్లాలో 23,477 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాస్తారని అధికారులు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. గత అనుభవాల ఆధారంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు.. వాటి వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం