మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రతి ఒక్కరూ... స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే అన్నారు. మరో రెండు నెలల పాటు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జిల్లాలోని ఆర్డీవో కార్యాలయం అరుణారెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ మురలియాదవ్, తహసీల్దార్ మాలతి ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయాశాఖల అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. స్వాతంత్య్రం కోసం సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండిః తొర్రూరు - నర్సంపేట మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు