జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం చేయాలంటూ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలోని టీఎన్జీవో భవన్లో బీసీ కౌన్సిలర్లకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
రాష్ట్రంలో తొలిదశ, మలిదశ ఉద్యమం జరిగిందని తెలిపిన జాజుల.. ఇక సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేయాలన్నారు. చట్టసభలు చుట్టసభలుగా మారిపోయాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలకు గాను.. కేవలం 20 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే బీసీల నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారన్నారు. ఈ భేటీలో తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ప్రతి జిల్లాలో బీసీ జాతరలు పెడుతూ అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం కౌన్సిలర్ కు సన్మానం చేశారు.
ఇదీ చదవండి:ఇతర రాష్ట్రాలకు 'వీ హబ్' ఆదర్శంగా నిలుస్తోంది: మంత్రి కేటీఆర్