సాధరణంగా తేనె పట్టు అంటే చిటారు కొమ్మన ఉంటుంది. లేకుంటే ఎత్తైన భవనాలకు... ఎవరికి అందనంతా ఎత్తులో ఉంటాయి. కానీ మెదక్ జిల్లా శివ్వంపేటలో తేనెటీగలు మాత్రం ట్రెండ్ మార్చాయి. ఎక్కడైతే ఏముందిలే అనుకుంటూ... ఓ రైతు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పిల్లర్ల మీద సేదతీరుతున్నాయి. తమను ఎవరూ ఏమి చేయరులే అని నమ్మకమో... ఎవరైనా మనల్ని టచ్ చూస్తే చుక్కలు చూపిద్దామనే ధైర్యమో... వాటిని అక్కడ ఉండేలా చేస్తుంది. వాటిని చూసిన రైతులు మనకెందుకులే అంటూ తమ పనిలో నిమగ్నమవుతుండగా... తేనెటీగలు కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి.
ఇదీ చూడండి: తేనెలూరించే అందాన్ని సొంతం చేసుకోండిలా..!