కరోనా మహమ్మారి కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు చెబుతున్నప్పటికీ మెదక్ పట్టణంలోని ప్రజలకు పట్టడంలేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పట్టణంలోని పెద్దబజార్లో తిరుగుతూ కరోనాకు స్వాగతం పలుకుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
వివిధ దుకాణ సముదాయాల వద్ద భౌతిక దూరం పాటించకుండా గుంపులుగుంపులుగా కొందరు తిరుగుతుంటే.. మరి కొందరు మాస్కులు కూడా పెట్టుకోకుండా తిరుగుతున్నారు. ఇలాగే వ్యవహరిస్తే మున్ముందు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని జాగ్రత్తలు తీసుకుంటున్నవారు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!