మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో శుక్రవారం 88 నామినేషన్‌లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడం వల్ల ప్రధాన పార్టీలు, స్వతంత్రులు భారీగా నామినేషన్‌లు వేశారు.
తెరాస మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డిలతో కలసి వచ్చి నామినేషన్ వేశారు.
అధిష్టానం సూచించిన మేరకు మురళీ యాదవ్‌ను బరిలో నిలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎన్నికల్లో విజయంపై దీమా వ్యక్తం చేశారు.
నర్సాపూర్‌లో మొత్తంగా ఇప్పటివరకు 145 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన