ETV Bharat / state

Harish Rao on Medak District Development : 'మెదక్​లో ఆత్మగౌరవానికి.. నోట్ల కట్టలకు మధ్య పోటీ' - మెదక్​లో మంత్రి హరీశ్

Harish Rao on Medak District Development : మెదక్ జిల్లాలో ఆత్మగౌరవాన్ని గెలిపించడానికి.. కాంగ్రెస్​ నాయకులు బీఆర్​ఎస్​లో చేరుతున్నారని హరీశ్​రావు అన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదని.. విలువలు ముఖ్యమని హరీశ్​రావు పేర్కొన్నారు.

Minister Harish Rao
Minister Harish Rao Medak Tour
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 8:51 PM IST

Harish Rao on Medak District Development : మెదక్​లో ఆత్మగౌరవానికి నోట్ల కట్టలకు మధ్య పోటీ జరుగుతుందని.. అందులో ప్రజలు ఆత్మగౌరవం గెలవాలని కోరుకుంటున్నారని మంత్రి హరీశ్​ రావు (Harish Rao) అన్నారు. ఇక్కడి నుంచి కొంతమంది కార్యాలయాలు తరిలించారని రూమర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని.. అది వాస్తవం కాదని తెలిపారు. ఇక్కడికే కొత్తగా చాలా కార్యాలయాలు వచ్చాయని.. మరిన్ని తీసుకురావడానికి కృషి చేస్తానని హరీశ్​రావు స్పష్టం చేశారు.

Harish Rao Reacts To Bangalore IT Raids Today : 'కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కట్టలు పంచినా.. గెలుపు బీఆర్​ఎస్​దే'

Medak Congress Leader Joins in BRS : టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఐదో వార్డు కాంగ్రెస్​ కౌన్సిలర్​ మామిళ్ల ఆంజనేయులు మంత్రి హరీశ్​రావు సమక్షంలో బీఆర్​ఎస్ పార్టీలో చేరారు. కొంతమందికి అవగాహన లేకుండా.. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా రాజకీయపరంగా విమర్శలు చేస్తున్నారని హరీశ్​రావు ఆరోపించారు. ఆత్మ గౌరవం నిలవాలని అనేకమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్​ఎస్​లో చేరుతున్నారని తెలిపారు. రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదని.. విలువలు ముఖ్యమని హరీశ్​రావు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మామిండ్ల ఆంజనేయులు బీఆర్ఎస్​లో చేరడం సంతోషంగా ఉందని.. హరీశ్​రావు పేర్కొన్నారు. ఆయన చేరికతో పార్టీకి ఎంతో బలం చేకూరిందన్నారు. వారికి తప్పకుండా భవిష్యత్​లో పార్టీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. మెదక్​లో పద్మా దేవేందర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్​రెడ్డి చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు పెట్టుకోవాలని హరీశ్​రావు తెలిపారు

BRS Incharges For 54 Constituencies : పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. 54 నియోజకవర్గాల ఇంఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం

Harish Rao Medak Tour : కొత్తగా మెదక్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్.. కాకుండా అనేక ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయని హరీశ్​రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ మీదున్న ప్రేమతో మూడు మండలాలున్న రామయంపేటను.. రెవెన్యూ డివిజన్ చేశారని గుర్తు చేశారు. అలాగే ఘనపూర్​ ఆనకట్ట వద్దకు సీఎం స్వయంగా హెలికాప్టర్​లో వెళ్లి.. ఆనకట్ట ఆధునికీకరణ, కాలువల ఎత్తు పెంచడానికి నిధులు మంజూరు చేశారన్నారు. మెదక్ పట్టణ అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్​ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని హరీశ్​రావు ధీమా వ్యక్తం చేశారు.

"కొంతమందికి అవగాహన లేకుండా.. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా రాజకీయపరంగా విమర్శలు చేస్తున్నారు. ఆత్మ గౌరవం నిలవాలని అనేకమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్​ఎస్​లో చేరుతున్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదు.. విలువలు ముఖ్యం." - హరీశ్​రావు, మంత్రి

Minister Harish Rao Medak Tour మెదక్​లో ఆత్మగౌరవానికి నోట్ల కట్టలకు మధ్య పోటీ

Harish Rao Inspected Place for KCR Meetings : ఈసారి బీఆర్​ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంటుంది : హరీశ్‌ రావు

Harish Rao Inspect Arrangements for Husnabad Public Meeting : 'బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే.. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాకే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.