ETV Bharat / state

ఎక్కడి వారు అక్కడే ఉండాలి: హరీశ్ - వలస కూలీలకు హరీశ్ రావు నగదు పంపిణీ

వలస కూలీలకు వసతి, నిత్యావస సరకుల పంపిణీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. లాక్​డౌన్​ అమలులో ఉన్నందున ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు. వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 నగదు అందజేశారు.

harish rao distribute rice and cash to migrant labor in medak
ఎక్కడి వారు అక్కడే ఉండాలి: హరీశ్
author img

By

Published : Apr 17, 2020, 3:44 PM IST

వలస కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఇవాళ మెదక్​ జిల్లాలో మంత్రి పర్యటించారు. హైదరాబాద్​ నుంచి 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలతో మాట్లాడి... ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు. ప్రభుత్వం కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నందున... పూర్తి వసతి కల్పిస్తుందని తెలిపారు.

మనోహరాబాద్ డబుల్​ బెడ్​రూమ్​ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న 88 మంది వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500ల నగదు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 4లక్షల మంది వలస కూలీలకు నిత్యావసర సరకులు అందించగా... మరో 2 లక్షల మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల బాధ్యత ఆయా కన్​స్ట్రక్షన్ కంపెనీల యజమానులదేనన్నారు. ఒకవేళ వారికి సాధ్యం కాకపోతే అధికారుల దృష్టికి తీసుకువస్తే... ప్రభుత్వమే వారికి సరకులు అందజేస్తుందన్నారు.

మెదక్ జిల్లాలో 2700 మంది వలస కూలీలను గుర్తించి వసతి కల్పించామని మంత్రి పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 8 వేల మందిని గుర్తించి వారికి ఫంక్షన్​ హాల్​లో వసతి ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అనంతరం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్​ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ నాగరాజు, ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా హాట్​స్పాట్​కు వెళ్లారని ఇంట్లోకి నో ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.