మెదక్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో తెరాస.. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. మంత్రి సమక్షంలో టీపీసీసీ కార్యదర్శి బట్టి జగపతి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్‌కు కాళేశ్వరం నీళ్లు తెచ్చి లక్ష ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి.
అగ్రస్థానంలో తెలంగాణ
మెదక్‌లో 800 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని.. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని హరీశ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపాలిటీ తెరాస ఎన్నికల ఇంఛార్జి రాధాకృష్ణ శర్మ, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు