ETV Bharat / state

'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు

author img

By

Published : Jan 9, 2020, 5:12 AM IST

Updated : Jan 9, 2020, 8:16 AM IST

రాష్ట్రంలో తొలిరోజు నామినేషన్ల సందడి నెలకొంది. నగర, పురపాలికల పరిధిలో.. మొదటి రోజే పలు పార్టీల అభ్యర్థులు 967 నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా కేంద్రాల వద్ద అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలువురు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

first-day-in-municipal-elections-nominations-in-telangana
'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు

పురపాలక ఎన్నికలకు సంబంధించి తొలిరోజు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 967 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 117 దాఖలు కాగా.. 94 నామినేషన్లతో పెద్దపల్లి తరువాతి స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో 84, జగిత్యాల జిల్లాలో 71 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులతో పాటు పార్టీల అభ్యర్థులుగా కూడా వార్డులకు నామినేషన్లు వేశారు. శుక్రవారం వరకు ఇందుకు అవకాశం ఉంది.

వివిధ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను గురువారం ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మెదక్​ పురపాలక సంఘంలో ఓ వార్డుకు సంబంధించి తన భార్యకు కాకుండా మరో పార్టీ నుంచి తెరాసలో చేరిన మరొకరికి టికెట్​ కేటాయించడంతో మనస్తాపానికి గురైన గోదల కృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

సెల్​ఫోన్​ లైట్​లోనే..

జనగామ మున్సిపాలిటీ కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉండటం, జనరేటర్​ లేకపోవడంతో గదలు చీకటిమయమయ్యాయి. కొందరు అభ్యర్థులు చాలీచాలని వెలుగులో, మరికొందరు సెల్​ఫోన్​ లైట్ల వెలుతురులోనే నామినేషన్​ పత్రాలు సమర్పించాల్సి వచ్చింది.

Tg_hyd_105_08_platform_tiket_hike_dry_3182388 Reporter : sripathi.srinivas ( ) సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్,కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫారం టికెట్ ధరలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణికులతో పాటు ఎక్కువ మంది వస్తుంటారు..ఆ రద్దీని తగ్గించడంలో భాగంగా టికెట్ ధరను పెంచమన్నారు. ప్రస్తుత టికెట్ ధర రూ.10 ఉండగా 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దాన్ని రూ.20కి పెంచుతున్నామన్నారు. Look...
Last Updated : Jan 9, 2020, 8:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.