ఇంట్లో దొరికే ఆహారపదార్థాలతోనే మంచి పోషక విలువలు గలిగిన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చని మెదక్ జిల్లా ఐసీడీఎస్ సంక్షేమ అధికారి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో గర్భిణీలకు సరకులు పంపిణీ చేశారు.
తల్లిపాలలోనే వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. పుట్టిన పిల్లలకు ఆరునెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఏడో నెల నుంచి అనుబంధ పోషక పదార్థాలను ద్రవరూపంలో అందించాలి. బిడ్డకు వ్యాధి నిరోధక టీకా మాదిరి పనిచేస్తుంది అని ఐసీడీఎస్ అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్ అధికారులు, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, అంగన్వాడి కార్యకర్త హేమలత పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'కరోనా బాధితులను కాపాడేందుకు కొవిడ్ వారియర్స్ ముందుకు రావాలి'