మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరికకరు జమ్మి పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. హిందూవాహిని ఆధ్వర్యంలో ధర్మశాలలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దుర్గా నిమజ్జనంలో విషాదం- ఏడుగురు మృతి