మెదక్ జిల్లా రైతుల వరప్రదాయని ఘనపూర్ ప్రాజెక్టు (వనదుర్గ ) పొంగిపొర్లుతోంది. నిన్నటి వరకు చుక్క నీరు లేక వట్టిపోయిన ప్రాజెక్టుకి... వర్షాల కారణంగా మూడు రోజుల నుంచి నీళ్లు వచ్చిచేరుతున్నాయి. దీంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. సుమారు రెండు సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిండిందంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ఖరీఫ్, రబీ సీజన్లో సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్‌కు నీటిని విడుదల చేసేవారు. సింగూర్ నుంచి 16 టీఎంసీల నీటిని తరలించడంతో... రెండు సంవత్సరాల నుంచి ఘనపూర్లోకి చుక్క నీరు కూడ రాలేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నిండటంతో వానకాలం పంటలపై రైతులకు ఆశలు చిగురించాయి.
ఇదీ చూడండి: గోదావరి ఉప్పొంగింది... కృష్ణమ్మ ఉరకలెత్తింది