ETV Bharat / state

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్​ - bjp laxman

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని ఈ సందర్భంగా ఆరోపించారు.

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్​
author img

By

Published : Oct 25, 2019, 11:45 PM IST

సిద్దిపేటలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర నేడు మెదక్ పట్టణానికి చేరుకుంది. ఈ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. అవుసుల పల్లి నుంచి రామదాసు చౌరస్తా వరకు పాదయాత్ర చేశారు. అనంతరం రాందాస్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు క్రియాశీల పాత్ర పోషించారని తెలిపిన లక్ష్మణ్​.. 50 వేల మంది కార్మికులను ముఖ్యమంత్రి రోడ్డున పడేయడం అమానుషమన్నారు. హుజూర్​నగర్​లో తెరాస గెలవగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శశిధర్ రెడ్డి, నందీశ్వర్ గౌడ్,​ తదితరులు పాల్గొన్నారు.

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్​

ఇవీ చూడండి: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

Intro:TG_SRD_44_25_GANDHI_SANKALPHA_AVB_TS10115.
రిపోర్టర్. శేఖర్.
మెదక్..9000302217.
గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఈ నెల 22న సిద్దిపేటలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర ఈరోజు మెదక్ పట్టణానికి చేరుకుంది. ఈ సంకల్ప యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు..
అవుసుల పల్లి నుండి , రామదాసు చౌరస్తా వరకు పాదయాత్ర. నిర్వహించారు అనంతరం రాందాస్ చౌరస్తాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు..
ఈ సందర్భంగా రాష్ట్ర అధికార బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు గాంధీ పేరును వాడుకుని తప్పితే ఏనాడు గాంధీ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు..
గాంధీ ప్రవచించిన పంచశీల సూత్రాలు ప్రజలందరికీ వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గాంధీ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు అన్నారు.
గాంధీ కోరుకున్న పరిశుభ్రత భారత్ ,అంటరానితనం నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన , లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు ..

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరును చూసి రంగులు మార్చే ఊసరవెల్లి సిగ్గుపడుతుందిఅని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ దుయ్య బట్టారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు క్రియాశీల పాత్ర పోషించగా తెలంగాణ వచ్చాక వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి 50 వేల మంది కార్మికులను రోడ్డున పడేయడం అమానుషం అన్నారు..
ఆర్టీసీ నాయకులు కార్మికులు సభా ప్రాంగణానికి తరలివచ్చి తమ డిమాండ్లతో కూడిన మెమోరాండం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అందజేశారు
ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని బిజెపి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..
గాంధీ వారసులం అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు
నకిలీ గాంధీలు గా మారారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.
రాజకీయాల కోసం, ఓట్ల కోసం గాంధీ పేరును వారు వాడుకున్నారు తప్పితే ఆయన ఆశయ సాధనకు ఏనాడు కృషిచేసిన పాపాన పోలేదని నిశితంగా విమర్శించారు.

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం ని స్థాపించేందుకు పరిశుభ్ర భారత్ నిర్మాణం లక్ష్యంగా కేంద్రంలో మోడీ సర్కార్ ముందుకు సాగుతుందన్నారు.
మహిళల వంటింటి ఇబ్బందులు తీర్చేందుకు ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని ,
స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదేళ్లలో ఏడున్నర కోట్ల మరుగుదొడ్లు నిర్మించిన ఘనత భారతీయ జనతా పార్టి ది అన్నారు..
నిజామాబాద్ ఎన్నికల్లో కవిత ఓడిపోయిన రాష్ట్రంలో నాలుగు చోట్ల బీజేపీ గెలుపొందిన వందలాది రైతులు ఆత్మహత్య చేసుకున్న ఎనాడు ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ గెలవగానే ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోయి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని విమర్శించారు.
కోట్లు గుమ్మరించి మద్యం పారించి,కులానికి మతానికి మంత్రులను పెట్టి ఓట్లు కొనుగోలు చేసి హుజూర్ నగర్ లో గెలుపొందారు అని ఇది ఒక గెలుపేనా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.....
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యేలు శశిధర్ రెడ్డి, నందీశ్వర్ గౌడ్ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య ఆకుల విజయ గోపి. బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్ యాదవ్. గడ్డం శ్రీనివాస్ నల్లాల విజయ్ బిజెపి కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

బైట్.
1.. రఘునందన్ రావు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి
2.. డాక్టర్ లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్

For All Latest Updates

TAGGED:

bjp laxman
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.