కరోనా నేపథ్యంలో.. వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పరీక్షలకు సంబంధించి అనేక సందేహాలను మెదక్ జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్ నివృత్తి చేశారు.
భౌతికదూరం తప్పనిసరి
ఈనాడు, ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. ఎక్కువగా పాత హాల్ టికెట్లు పనిచేస్తాయా, పరీక్ష కేంద్రాలు మారాయా, రవాణా సౌకర్యం ఏర్పాటుపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డీఈఓ సమాధానం చెప్పారు. పరీక్ష కేంద్రాలకు ఒక గంట ముందుగానే రావాలని సూచించారు. విద్యార్థులు భౌతికదూరం పాటించాలని ప్రతి గదిలో 10 నుంచి 12 మందిని బెంచ్‌కు ఒకరు పరీక్ష రాసే విధంగా గదులను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో మోగుతున్న కరోనా ఘంటిక