మెదక్ జిల్లా ఘనపూర్ మండల రాజ్పేట వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రూ.5 కోట్ల 50 లక్షలతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. భారీ వర్షాలు కురిసి వాగుకు వరద వస్తే మెదక్, కామారెడ్డి జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారని మంత్రి అన్నారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన చేశారు కానీ పనులు పూర్తి చేయలేదన్నారు. కొండపోచమ్మసాగర్ ద్వారా హల్దీకి అక్కడి నుంచి బొల్లారం మత్తడికి, అక్కడి నుంచి ఎంఎన్ కెనాల్ ద్వారా పోచారం ప్రాజెక్టును నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త