ETV Bharat / state

Etela rajender land issue: రెండోరోజు కొనసాగుతున్న ఈటల రాజేందర్ భూముల సర్వే - తెలంగాణ వార్తలు

ఈటల రాజేందర్ భూముల సర్వే(Etela rajender land issue) రెండోరోజు కొనసాగుతోంది. ఈటల, ఆయన సతీమణి జమునకు సంబంధించిన భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే భూములు సర్వే చేస్తున్నారు.

Etela rajender land issue, jamuna hatcheries lands
ఈటల రాజేందర్ భూముల సర్వే, జమున హెచరీస్ భూముల వ్యవహారం
author img

By

Published : Nov 17, 2021, 3:09 PM IST

ఈటల రాజేందర్ భూముల సర్వే(Etela rajender land issue) రెండోరోజు కొనసాగుతోంది. ఈటల, ఆయన సతీమణి జమునకు సంబంధించిన భూముల్లో అసైన్డ్‌ ల్యాండ్స్‌ ఉన్నాయంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్వే చేపట్టి నిజనిర్ధరణ చేయాల్సి ఉందన్నారు. అందులో భాగంగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట వద్ద రెవెన్యూ అధికారులు భూములు సర్వే చేస్తున్నారు. ఈటల కుటుంబంతో పాటు మరికొందరికి ఇటీవల అధికారులు నోటీసులిచ్చారు. అచ్చంపేటలో 77 నుంచి 82 సర్వే నంబర్లలో అధికారులు సర్వే చేస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన సర్వే ఇవాళ కూడా కొనసాగుతోంది. గురువారం హకీంపేటలోని భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేయనున్నారు.

మొదటి రోజు సర్వే

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల్లో అధికారులు మొదటి రోజు సర్వే(etela rajender land survey) మంగళవారం చేపట్టారు. ఈటలకు చెందిన జమున హేచరీస్(Jamuna hatcheries) భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అచ్చంపేట పరిధిలోని 130 సర్వే నంబర్‌లోని 18ఎకరాల 35గుంటల భూమిని సర్వే చేసి.. సబ్ డివిజన్ వారీగా హద్దులు ఏర్పాటు చేశారు. ఇందులో అధికారులతో పాటు 20మంది రైతులు, ఇద్దరు జమున హేచరీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు, రైతులను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత జమున హేచరీలోకి నిర్వాహకులు అనుమతించారు. ఈనెల 18న హకీంపేట పరిధిలోని భూములను సర్వే(Etela Hakeem pet lands' survey) చేయనున్నారు. గురువారం వరకు సర్వే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే జరుగుతున్న సమయంలో ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలు... జమున హేచరీ ముందు నిరసనకు దిగాయి. వారికి పోలీసులు నచ్చజెప్పి పంపిచారు.

ఆక్రమణలు జరిగాయని గతంలోనే నివేదిక

మెదక్ జిల్లా(medak district news) మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. తమ భూములను ఈటల ఆక్రమించారని(land grabbing allegations on etela) ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలు రంగంలోకి దిగాయి. అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఈటల రాజేందర్(Etela rajender) హేచరీల(Jamuna Hatcheries)తో పాటు పక్క భూముల్లో సర్వే నిర్వహించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అప్పట్లో కోర్టుకెళ్లిన ఈటల

అధికారుల తీరుపై ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు హైకోర్టు(Telangana High court)ను ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సర్వే జరిగిందని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు, తగు సమయం ఇచ్చి.. సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో జూన్ మూడో వారంలో పునఃసర్వేకు అధికారులు సిద్ధం కాగా.. కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు.

ఇదీ చదవండి: జమున కోళ్ల ఫారాల వద్ద 'ప్రభుత్వ భూమి' బోర్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.