ETV Bharat / state

Etela Rajender Fire on KCR: 'సీఎం కేసీఆరే దాడి చేయాలనటం దారుణం..' - Etela Rajender on paddy procurement

Etela Rajender Fire on KCR: మెదక్​లో పర్యటించిన హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సీఎం కేసీఆర్​ వైఖరిపై మండిపడ్డారు. తన అసమర్థతను, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భాజపా శ్రేణులపై సీఎం కేసీఆరే.. దాడి చేయలనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Etela Rajender Fire on CM KCR in medak
Etela Rajender Fire on CM KCR in medak
author img

By

Published : Dec 19, 2021, 6:53 PM IST

Updated : Dec 19, 2021, 7:18 PM IST

'సీఎం కేసీఆరే దాడి చేయాలనటం దారుణం..'

Etela Rajender Fire on KCR: సీఎం కేసీఆర్‌ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ధాన్యం సమస్యను కేంద్రంపైకి నెట్టుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. హుజురాబాద్ ఉప​ఎన్నికల్లో గెలుపొందితే మొక్కు చెల్లించుకుంటామన్న మెదక్​ జిల్లా భాజపా నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలను సందర్శించారు. ఆలయ పూజారులు ఈటలకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వనదుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించి ఈటల మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఈవో సార శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఈటల రాజేందర్​ను శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

బంగాల్‌ ఫార్ములా అమలు..!

ధాన్యం కొనుగోలు పట్ల కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. కేసీఆర్‌ తీరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు చనిపోతున్నారని ఆక్షేపించారు. ధాన్యం సమస్యకు పరిష్కారం చూపకుండా ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలు క్షమించరని దుయ్యబట్టారు.

"భాజపా శ్రేణులపై దాడి చేయాలని సీఎం కేసీఆర్​ చెప్పటం దారుణం. బంగాల్‌ ఫార్ములాను కేసీఆర్​ ఇక్కడ అమలు చేయాలనుకుంటున్నారు. ధాన్యం విషయంలో కేంద్రంపై తెరాస నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రైసుమిల్లులపై దృష్టి పెట్టకుండా కేంద్రంపై నెపం వేస్తున్నారు. సీఎం ఒకసారి పత్తి అన్నారు, మరోసారి సన్నవడ్లు అన్నారు, ఇంకోసారి దొడ్డువడ్లు అన్నారు, ఇప్పుడేమో అసలు వరే వద్దంటున్నారు. కేంద్రం ఇస్తేనే రాష్ట్రంలో అన్ని పథకాలు అమలు చేస్తున్నారా? ఎద్దు ఎడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న కేసీఆర్​.. ఈరోజు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. కేసీఆర్​ ఆత్మవిమర్శ చేసుకుని రైతుల పట్ల పంతం వదలేయాలి." - ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

Last Updated : Dec 19, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.