ఈస్టర్ పర్వదినం పురస్కరించుకొని... రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల చర్చిల్లో క్రైస్తవులు ప్రార్ధనలు నిర్వహించారు. ఈస్టర్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ఉదయం నాలుగున్నర గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి సంప్రదాయం ప్రకారం శిలువను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రార్థన మందిరంలో ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.
అనంతరం బిషప్ సాల్మన్ రాజు భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణాలన్నీ ప్రభు గీతాలతో మార్మోగాయి. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కీరా‘దోస’తో కూల్... కూల్..!