తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా దొంత నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అధ్యక్షుడు మేడిశెట్టి శ్యామ్ రావు పదవీ విరమణ చేయడంతో జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జరిగిన టీఎన్జీవో జిల్లాకార్యవర్గ సమావేశం జరిగింది. కార్యవర్గం నరేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
మెదక్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన టీఎన్జీవో జిల్లాకార్యవర్గ సమావేశంలో కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోవడంతోపాటుగా నూతన కార్యవర్గాన్ని ఆ సంస్థ సభ్యులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేందర్ తన ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో సంఘాన్ని బలోపేతం చేయడంతోపాటు ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నరేందర్ ప్రస్తుతం ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: లెక్కలు తారుమారు- భాజపా బేజారు