మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగయిపేట్ గ్రామంలో డీఆర్డీఓ శ్రీనివాస్ ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం కరోనా వైరస్ గురించి కూలీలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో తప్ప బయటకు వెళ్లకూడదన్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వామనరావు, ఏపీవో మహిపాల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశం, సర్పంచ్ తదితరులు ఉన్నారు.
ఉపాధి హామీ కూలీలకు మాస్కుల పంపిణీ - ఉపాధి హామీ కూలీలకు మాస్కుల అందజేత
మెదక్ జిల్లాలోని కొల్చారం పరిధిలో ఉపాధి హామీ కూలీలకు మాస్కులను పంపిణీ చేశారు డీఆర్డీఏ శ్రీనివాస్. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని డీఆర్డీఓ కోరారు.