ETV Bharat / state

తియ్యతియ్యగా..: సీతాఫలం... ఔషధ గుణాలు పుష్కలం - సీతాఫలం... నోటి నిండా తియ్యగా...

మధురమైన రుచితో ఉండే సీతాఫలాలను అందరూ ఇష్టపడతారు. ఒకప్పుడు విరివిగా దొరికిన ఈ పండ్లు.. ప్రస్తుతం వివిధ కారణాలతో లభ్యత క్షీణించింది. ఫలితంగా పండ్లకు డిమాండ్ పెరిగిపోయింది. దీన్నే ఆసరాగా చేసుకుని మెదక్ జిల్లాలో కొంత మంది అడవుల నుంచి సీతాఫలాలు సేకరించి ఉపాధి పొందుతున్నారు.

నోరూరించే సీతా ఫలానికి భలే గిరాకీ
author img

By

Published : Nov 22, 2019, 4:33 PM IST

నోరూరించే సీతా ఫలానికి భలే గిరాకీ

నోట్లో వేయగానే తియ్యగా కరిగిపోయే సీతాఫలాల రుచి తెలియని వారు ఉండరు. కాయలను మాగబెట్టుకుని.. ఉదయాన్నే లేచి ఆత్రుతగా మగ్గావో లేదే చూసుకోవడం ప్రతీ ఒక్కరి బాల్య స్మృతి. సీతా ఫలాల్లోని ఔషధ విలువలపై అందరికీ అవగాహన పెరగటం వల్ల... ఇప్పుడు వీటికి భారీ గిరాకీ ఉంది.

డిమాండ్ మెండుగా...

ఈ పండ్లకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరగడం వల్ల ఉపాధి సైతం చూపిస్తోంది. దసరా నుంచి ప్రారంభమయ్యే ఈ పండ్ల సీజన్ దాదాపుగా రెండు నెలలు ఉంటుంది. రామాయంపేటలో సీతాఫలాల కోసం పెద్ద మార్కెట్ ఏర్పడింది. సీజన్​లో ప్రతీ రోజు దాదాపు ఐదు వందల మంది వరకు ఈ మార్కెట్​కు సీతాఫలాలు తీసుకొస్తారు. ఒక్కొక్కరు 1500 నుంచి 2000 రూపాయల వరకు ప్రతీ రోజు ఆర్జిస్తారు.

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

రామాయంపేటలో గత 18 ఏళ్ల నుంచి సీతాఫలాల మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడికి మెదక్ జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన 70 గ్రామాల ప్రజలు సరకు తీసుకొస్తారు. ప్రతీ రోజు వందల టన్నుల సీతాఫలాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్నాటకకు సీతాఫలాలు పెద్ద మెుత్తంలో ఎగుమతి అవుతున్నాయి.

తక్కువ ధరకే నాణ్యమైన ఫలాలు
నాణ్యమైన సీతాఫలాలు... సరసమైన ధరకు లభిస్తుండటం వల్ల వ్యాపారులు రామాయంపేట మార్కెట్​కు ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ సమీప ప్రాంతాల్లో లభిస్తున్నా... సరైన నాణ్యత లేకపోవడం వల్ల.. వ్యాపారులు రామాయంపేట మార్కెట్​కే తరలి వస్తున్నారు. పెద్ద వ్యాపారులతో పాటు టోకు వ్యాపారులు సైతం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. రామాయంపేట మార్కెట్ ఏటా అభివృద్ధి చెందుతూ.. సీతాఫలాల మార్కెట్​కు కేంద్రంగా మారుతోంది.

ఇవీ చూడండి : 'జల సంక్షోభానికి' తెరదించాల్సిన సమయమిది..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.