ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: పుస్తకాలుండాల్సిన చేతులు పలుగు, పార పట్టాయి..

కరోనా వైరస్​ వ్యాప్తి, లాక్​డౌన్ ప్రభావం విద్యావ్యవస్థపై తీవ్రంగా పడింది. విద్యాసంవత్సం ప్రారంభమైతే కళాశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు.. కూలీలుగా మారారు. కనీస ఖర్చుల కోసం, తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు హరితహారం మొక్కలు నాటే పనులకు వెళుతున్నారు.

corona-effect-students-participate-harithaharam-plantations-works-at-medak
కరోనా ఎఫెక్ట్: కూలీగా మారిన కళాశాల విద్యార్థులు
author img

By

Published : Jul 30, 2020, 5:49 PM IST

రోజురోజుకు కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోన్నందున కళాశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో చదువుకోవాల్సిన విద్యార్థులు ఉపాధి పనులకు వెళ్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. కొంగోడు, హంసన్​పల్లి, పోతిరెడ్డిపల్లి, దామరాంచ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు హరితహారం కార్యక్రమంలో దినసరి కూలీగా పాల్గొంటున్నారు.

ఈ విషయమై విద్యార్థులను అడగ్గా.. మహమ్మారి కష్టకాలంలో తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో తామంతా ఒక బృందంగా ఏర్పడి పనులకు వస్తున్నామన్నారు. దినసరి కూలీగా రూ. 300 ఆర్జిస్తున్నట్లు తెలిపారు. కుటుంబానికి ఆసరగా నిలుస్తున్నామని చెబుతున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.