ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. ఒక్క గురువారం రోజే 88 మంది వైరస్ బారిన పడగా.. చికిత్స పొందుతూ ఇద్దరు. వైరస్ లక్షణాలతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
సిద్దిపేట జిల్లాలో 20 మందికి వైరస్ సోకగా... కరీంనగర్లో చికిత్స పొందుతూ ఒకరు, సిద్దిపేట జిల్లాలో కరోనా లక్షణాలతో మరొకరు మరణించారు. సంగారెడ్డి జిల్లాలో 59 మంది కరోనా బారిన పడగా.. ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లాలో 9 మందికి వైరస్ సోకింది. ఒకరు వైరస్ లక్షణాలతో మరణించారు.
మెదక్ జిల్లాలోని సదాశివపేటలో ఈరోజు నుంచి మూడ్రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రకటించారు. మరోవైపు జహీరాబాద్లో శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. సంగారెడ్డిలోని ఎమ్ఎన్ఆర్ వైద్యకళాశాలలో ఏర్పాటు చేసిన కరోనా వార్డును శుక్రవారం రోజు మంత్రి హరీశ్ రావు పరిశీలించనున్నారు.
- ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్..