పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(PCC Chief Revanth Reddy) పై... కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Working President Jagga Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీకి వచ్చిన జగ్గారెడ్డి... ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (MP Uttam Kumar Reddy), సీఎల్పీనేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) ఎదుట... రేవంత్ రెడ్డిపై మండి పడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా... లేక ప్రైవేటు కంపెనీ అనుకుంటున్నారా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను. నాకు గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. ఎవరి ఒత్తిడి మేరకు సభాధ్యక్షురాలు గీతారెడ్డి మాట్లాడటానికి నాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏమి జరుగుతుంది? ఒకరి నెత్తిన ఒకరు చెయ్యి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరు? ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాను. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేకుండా పోయింది. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు. చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారే కనుమరుగయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్లి పని చేయాలి. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ మద్ధతు లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తా.
-ఎమ్మెల్యే జగ్గారెడ్డి
రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని జగ్గారెడ్డి(Congress Working President Jagga Reddy) ఆరోపించారు. జహీరాబాద్ వస్తూ... తనకు గానీ... గీతారెడ్డికి గానీ కనీసం సమాచారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో క్రికెట్ టోర్న్‌మెంట్ కార్యక్రమానికి హాజరవుతున్న రేవంత్ రెడ్డి... స్థానిక ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేనికి సంకేతమంటూ ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రచారం కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో కుదరదని స్పష్టం చేశారు. తాను లేకుండా జహీరాబాద్ కార్యక్రమంలో పీసీసీ పాల్గొంటే... పరోక్షంగా తనకు రేవంత్‌కు మధ్య విబేధాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా అంటూ నిలదీశారు.
ఇదీచూడండి: Revanth Reddy : అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నాం : రేవంత్