తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. హరీశ్‌రావు తనకు నామినేటెడ్ పోస్టు ఇస్తానని ఆశ జూపారని, ఆయనకే దిక్కు లేదు తనకేమిస్తాడని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేస్తూ, తెరాస మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. తెరాస ఓడిపోతుందనే భయంతో ఇలాంటి ప్రచారాలకు దిగుతోందని ఆరోపించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:'నిబంధనలు ఉన్నా... ఈవీఎంలతోనే ఎన్నికలెందుకు'