ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్​ హనుమంతరావు

author img

By

Published : Oct 30, 2020, 7:54 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలపరిధిలోని నిర్మితమవుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్​ హనుమంతరావు పరిశీలించారు. నవంబర్​ 15 లోపు మరిన్ని రైతు వేదికలను పూర్తి చేస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు.

collector hanumantharao visit at rythu vedika bhavan at medak district
రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్​ హనుమంతరావు

రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని మెదక్​ జిల్లా కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలపరిధిలోని అవంచ, రెడ్డిపల్లి, ఇబ్రహీంబాద్​ గ్రామాలతో పాటు కౌడిపల్లి మండలం పలు గ్రామాల్లో నిర్మాణాలు చేస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. నవంబర్​ 15 లోపు మరిన్ని రైతు వేదికలను పూర్తి చేస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు.

మండలంలో రైతు వేదిక పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్​ తెలిపారు. రైతులు.. తేమ శాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని హనుమంతరావు అన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ఎల్లప్పుడూ టార్పాలిన్​ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

ఇదీ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.