కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకువెళ్లిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట రుప్లా తండా వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోమారానికి చెందిన శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణ్ వెల్ధుర్తి- నర్సాపూర్ రహదారిలో ప్రయాణిస్తుండగా... కారు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. వెంటనే స్పందించిన తండావాసులు క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు.
కారు అదుపుతప్పి ప్రమాదం... నలుగురికి గాయాలు - ACCIDENT NEWS IN TELUGU
మెదక్ జిల్లా శివ్వంపేట రుప్లా తండా వద్ద ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకువెళ్లిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట రుప్లా తండా వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోమారానికి చెందిన శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణ్ వెల్ధుర్తి- నర్సాపూర్ రహదారిలో ప్రయాణిస్తుండగా... కారు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. వెంటనే స్పందించిన తండావాసులు క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్