ETV Bharat / state

స్లాబుల సాకుతో జనాల జేబులకు చిల్లు : శశిధర్​ రెడ్డి - High Power Bills BJP Protest

కరెంట్​ స్లాబు​లను సాకుగా చూపి జనాల జేబులకు ప్రభుత్వం చిల్లు పెడుతోందని భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే పట్లోరి శశిధర్​ రెడ్డి అన్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వం పిలుపుతో అధిక విద్యుత్​ బిల్లులకు నిరసనగా మెదక్​ ట్రాన్స్​కో ఎస్​ఈ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు.

bjp protest
నిజామాబాద్​లో భాజపా ధర్నా
author img

By

Published : Jun 15, 2020, 7:36 PM IST

రాష్ట్ర ప్రజలపై మోపుతున్న అధిక విద్యుత్​ బిల్లుల భారాన్ని వెంటనే మాఫీ చేయాలని భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే పట్లోరి శశిధర్​ రెడ్డి డిమాండ్​ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు మెదక్ ట్రాన్స్​కో ఎస్​ఈ కార్యాలయం వద్ద భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు.

పేద, మధ్య తరగతి ప్రజలపై మోపుతున్న విద్యుత్​ ఛార్జీల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలని శశిధర్​ రెడ్డి అన్నారు. అదే విధంగా విద్యుత్​ బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని కోరారు. ధర్నాలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతోపాటు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ అసెంబ్లీ ఇన్​ఛార్జీ గోపి, నాయకులు మల్లప్ప, సుధాకర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడి.. తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో గవర్నర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.