మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలానికి చెందిన విజయ (25)కు నెలలు నిండడం వల్ల జూన్ 29న కుటుంబ సభ్యులు వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజులు పాటు వైద్యం అందించిన వైద్యులు.. సరైన సౌకర్యాలు లేవని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఈ నెల 3న నగరానికి వచ్చారు. కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స నిర్వహించేందుకు నిరాకరించారు. అక్కడి నుంచి సోమాజిగూడలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లగా పడకలు లేవని పంపించేశారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మరో ఆసుపత్రికి వెళ్లగా.. గర్భిణి పరిస్థితి బాగోలేదని, వైద్యం చేసేందుకు నిరాకరించారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్‌లోని మరో ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడా వైద్యానికి నిరాకరించడం వల్ల కుటుంబ సభ్యులు 100 నంబర్‌కు ఫోన్ చేశారు.
పోలీసులు వచ్చి వైద్యం చేయాలని సూచించారు. చికిత్సకు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని.. చెప్పడం వల్ల చేసేదేంలేక సొంతూరికి వెళ్లిపోయారు. తెలిసిన వారి సలహాతో 5న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే కడుపులో శిశువు మృతి చెంది ఉన్నందున ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి శిశువును తొలగించారు. తల్లి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉండటం వల్ల గురువారం ఆమెను డిశ్ఛార్జి చేశారు.
ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..