ఆధునిక పద్ధతుల్లో సాగు రైతు అభివృద్ధికి దోహదంచేస్తుందని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం నాయక్ అన్నారు. హవేలీ ఘనపూర్ మండలం కుచన్‌పల్లిలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి పొలంలో డ్రోన్‌తో పంటలకు మందుల పిచికారీపై అవగాహన కల్పించారు.
డ్రోన్ పరికారంతో కేవలం10 నిమిషాల్లో ఎకరాపొలానికి మందు పిచికారి చేయవచ్చన్నారు. ఇలా చేయడం వల్ల రైతు.. కూలీల, నీటి కొరత అధిగమించి సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని సూచించారు. అన్నదాతలు అధునాతన పద్ధతులు అవలంభించి అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు.
డ్రోన్ ద్వారా మందులు పిచికారి చేయడంతో విచ్చలవిడిగా రసాయనాలు చల్లకుండా నివారించి ఖర్చు తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏలు నగేష్, వెంకటరామరెడ్డి, స్థానిక సర్పంచ్ దేవగౌడ్, ఏఓలు, ఏఈఓలు ప్రవీణ్, ప్రతాప్, నాగమాధురి, ప్రశాంత్, విజృంభణ, రాకేష్, స్వాతి, సర్పంచ్‌లు రాజేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విపత్తుల నుంచి కాపాడతామన్నారు.. ఇప్పుడు ముంచేస్తున్నారు!