ప్రభుత్వ సూచనలపై ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితరహిత కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు జిల్లా అదనపు పాలనాధికారి నగేశ్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఈ ఆఫీస్‌ను ప్రారంభించారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోను ఈ ఆఫీస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ–సేవ, మీ–సేవ తరహాలో ఈ –ఆఫీస్‌లను ఎలాంటి కాగితాలు, పేపర్లు ఉపయోగించకుండా పనులు నిర్వర్తించాలన్నారు. అధికారుల సంతకాలను డిజిటల్ సిగ్నేచర్ కీ (డీఎస్కీ) తయారు చేయించాలని... ఏదైనా సంతకం ఉంటే ఆన్లైన్లోనే లాగిన్ చేసుకోవాల్సిందిగా వివరించారు. కార్యక్రమంలో ఎన్ఐసీ జిల్లా మేనేజర్ సందీప్, ఐటీఈ అండ్ సీ డిపార్టుమెంట్, ఎన్ఐసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నిర్మల్ జిల్లాలో అంబరాన్నంటిన జెండా పండుగ సంబరాలు