మెదక్ మండలం పాతూర్ గ్రామంలో కుంటి నాగరాజు అనే రైతు ఎకరం విస్తీర్ణంలో సన్న రకం వరి సాగు చేశాడు. పంట బాగానే ఎదిగినప్పటికీ.. చేతికొచ్చే సమయంలో దోమపోటు సోకింది. క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే పెట్టిన పెట్టుబడి సైతం చేతికి రాదని మనస్తాపానికి గురైన నాగరాజు.. స్వయంగా తన చేతులతోనే పంటకు నిప్పు పెట్టాడు. చూస్తుండగానే పంటంతా కాలి బూడిదైంది. ప్రభుత్వం సన్న రకం వరి సాగు చేయించడం వల్లే తమకు ఈ దుస్థితి ఎదురైందని రైతు వాపోయాడు. దోమపోటుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి.. ఆదుకోవాలని కోరుతున్నాడు.
ఇదీ చదంవడి: బండి సంజయ్‌పై తెరాస నేతల ఫిర్యాదు