ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. మెదక్ ప్రాథమిక సహకార సంఘానికి 13 బ్లాక్‌లకు గాను 3 రోజులలో మొత్తం 46 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి రాంబాబు వెల్లడించారు. నామినేషన్లకు నేడు చివరి రోజు కాగా... అధిక సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు.
అభ్యర్థులతో పాటు వారి మద్దతుదారులతో సహకార సంఘాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 9న నామినేషన్ల పరిశీలన ఉంటుందని 10న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుండగా... 15న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి రాంబాబు వివరించారు.
ఇదీ చూడండి: ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!