మెదక్ జిల్లా రామాయంపేటలో ఇటీవల కాలంలో కరోనా వ్యాధిగ్రస్తులు పెరుగుతుండగా.. వ్యాపారస్థులు స్వచ్ఛంద బంద్కు దిగారు. శుక్రవారం నుంచి 14 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించారు. అన్ని వ్యాపార సముదాయాలను మూసివేశారు. గత కొద్దిరోజులుగా రామాయంపేటలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున వ్యాపారస్థులు బంద్ పాటించాలని నిర్ణయించారు.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 14 రోజుల పాటు లాక్డౌన్ ఉంటుందని.. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు. కూరగాయలు, మందుల దుకాణాలు మినహా అన్ని మూసి ఉంచాలని కోరారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
ఇదీ చూడండి: భారత్కు రఫేల్- వాయుసేనకు కొత్త శక్తి