ETV Bharat / state

ఈత రాక హోలీ స్నానం  ప్రాణం తీసింది..!

హోలీ పండుగలో అపశృతి చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా హోలీ అడుకున్నాడు. తర్వాత స్నానానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు వాగులోతుకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో జరిగింది.

young man died in holi festival at mancherial district
ఈత రాలేదు.. ప్రాణాలు తిరిగి రాలేదు
author img

By

Published : Mar 9, 2020, 8:03 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామం హోలీ పండుగలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అజయ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్నేహితులతో కలిసి హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత గ్రామ సమీపంలోని వాగు వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. అందరూ ఒకే సారి వాగులోకి దిగారు. కానీ అజయ్​ ఎక్కువ లోతు ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగి మరణించాడు.

ఇది గమనించిన స్నేహితులు గ్రామస్థులకు సమాచారం తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడకి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ మేరకు రామకృష్ణాపూర్ ఎస్ఐ రవి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈత రాలేదు.. ప్రాణాలు తిరిగి రాలేదు

ఇదీ చూడండి : అమృత వల్లే ఈ దారుణాలన్నీ: మారుతీరావు తమ్ముడు శ్రవణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.