ETV Bharat / state

Corona Effect: కరోనా వచ్చిందని బాత్రూంలో క్వారంటైన్.. - బాత్రూంలో క్వారంటైన్

కరోనా మనుషుల మధ్య ప్రేమానూరాగాలను దూరం చేస్తోంది. ఇంట్లో నాలుగు గదులు ఉన్నా... మిగిలిన వారికి కరోనా సోకుతుందనే భయంతో ఆ ఇంటి సభ్యులు ఆమెను స్నానాల గదికి పరిమితం చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

woman quarantine in wash room at mancherial
Corona Effect: ఇంట్లో నాలుగు గదులున్నా... కరోనా భయంతో
author img

By

Published : Jun 4, 2021, 4:33 PM IST

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పురపాలక పరిధిలోని గోదావరిరోడ్డులో ఓ మహిళ కరోనా బారిన పడింది. కుటుంబసభ్యులు తమకు వైరస్ సోకకూడదని... ఇంట్లో నాలుగు గదులు ఉన్నా... ఆమెను స్నానాల గదికి పరిమితం చేశారు. ఆరు రోజులుగా ఆమె పడుతున్న ఇబ్బందులను గమనించిన పొరుగువాళ్లు స్థానిక ఎస్సై చంద్రశేఖర్​ దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన ఎస్సై బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. ఇంట్లో ఇబ్బందిగా ఉంటే బెల్లంపల్లిలోని కొవిడ్​ ఐసోలేషన్​ కేంద్రానికి తరలించాలని సూచించారు. బాధితురాలు అంగీకరించకపోవడంతో... ఇంట్లోని ఓ గది ఖాళీ చేయించి అందులో ఆమెకు ఉండేందుకు ఏర్పాట్లు చేయించారు.

ఇదీ చూడండి: బాలికపై అత్యాచారం- డీఎస్పీపై ఎఫ్​ఐఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.