యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిన వివేకానందుడి ఆశయాలతో యువత ముందుకు సాగాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడ్ల మహేష్ కోరారు. వివేకానందుడి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో టీం పంచముఖి యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవయవదానం, రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అవయవదానంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశం దక్కుతుందని సీఐ అన్నారు. అవయవాలు పొందిన వారు జీవితాంతం దాతలు, వారి కుటుంబ సభ్యుల్ని గుర్తుంచుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యువకులు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఇదీ చదవండి: శరీర ప్రకృతిని అనుసరిస్తేనే ఆరోగ్యం