పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వందురుగూడ గ్రామస్థులు బహిష్కరించారు. తమ గ్రామాన్ని వెంకటాపూర్ పంచాయతీలో కలపాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని పల్లెప్రగతి కార్యక్రమం కోసం గ్రామానికి వచ్చిన అధికారులకు నివేదించారు. ఎంపీడీవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.
ఇవీచూడండి: యువకులపై పోలీసుల దాడి ఘటనలో ఐజీ ఆగ్రహం