మంచిర్యాల జిల్లా చెన్నూరులో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు ఎమ్మెల్యే బాల్క సుమన్, జడ్పీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తోపాటు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులకు క్రియాశీలక సభ్యత్వం రసీదును అందజేశారు. నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్నాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: తమిళనాట మరోమారు 'అనర్హత' రాజకీయం