మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారంలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు దొరికాయి. రెండు రోజుల నుంచి మండలంలోని బొప్పారం, జోగపూర్ అటవీప్రాంతం మధ్యలో కే 4 పేరు గల పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్ పనులు చేపడుతుండగా కార్మికులు పులి అడుగులు గుర్తించారు. కోటపల్లి అటవీ ప్రాంతం నుంచి పులి ఇటువైపుకు రెండు రోజుల నుంచి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో ఈ పులికి వేటగాళ్ళు ఉచ్చు బిగించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో పులికి ఉచ్చు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలిస్తే దాని ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందనే... వివరాలు తెలిపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. గ్రామస్థులు మాత్రం పులి అడుగుజాడలు చూసి భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: కన్నెపల్లిలో 10వ పంప్‌తో గోదావరి జలాల ఎత్తిపోత