మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలానికి చెందిన రాంటెక్కి గవాస్కర్, దుర్గం దిలీప్, జరుపుల నరేందర్లుగా గుర్తించారు.
కలకత్తాకు చెందిన ఉదయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్న ఈ ముగ్గురు నిందితులు.. ఇప్పటి వరకు పలువురి వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని ఏసీపీ రహమాన్ వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..