మంచిర్యాల జిల్లా మందమర్రిలో 23 మంది సింగరేణి తొలగింపు కార్మికులు నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సింగరేణి కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదిహేనేళ్లుగా పోరాటం చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు