ETV Bharat / state

వేలాల మల్లన్నను దర్శించిన రామగుండం సీపీ - RAMAGUNDAM CP SATYANARAYANA

శివరాత్రి పర్వదిన సందర్భంగా వేలాల మల్లికార్జున స్వామికి రామగుండం కమిషనర్ సత్యనారాయణ డీఐజీ హోదా పొందిన అనంతరం తొలిసారిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మల్లన్నను దర్శించిన రామగుండం సీపీ
మల్లన్నను దర్శించిన రామగుండం సీపీ
author img

By

Published : Feb 22, 2020, 9:57 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ డీఐజీగా పదోన్నతి పొందిన తర్వాత మొదటి సారిగా ప్రత్యేక పూజలు చేశారు. మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామిని సీపీ దర్శించుకున్నారు. అనంతరం దర్శనానికి వచ్చే భక్తులకు బందోబస్త్ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. మల్లన్న దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతితో ఆనందంగా ఇంటికెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా చూడాలని సూచించారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీసీపీ ఏఆర్ కమాండెంట్ సంజీవ్, జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్, జైపూర్ ఎస్ఐ విజేందర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

మల్లన్నను దర్శించిన రామగుండం సీపీ

ఇవీ చూడండి : కీసర రామలింగేశ్వరాలయం... రుద్రేశ్వరమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.