గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని ఆర్‌కేపీ ఉపరితల గనితో పాటు శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్‌పీ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్‌లోకి వరద నీరు చేరడం కారణంగా మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు రోజుల్లో సుమారు 40 వేల టన్నులు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చూడండి: ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు