ETV Bharat / state

భగీరథ నీటి ట్యాంకు నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే భూమి పూజ - పెద్దపల్లి ఎంపీ వెంకటేష్​ నేత తాజా వార్తలు మంచిర్యాల

మంచిర్యాలలోని తోళ్ల వాగు సమీపంలో మిషన్​ భగీరథ నీటి ట్యాంకు నిర్మాణానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత, ఎమ్మెల్యే దివాకర్ రావు భూమి పూజ చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భాజపా నాయకులు.. తెరాస ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు.

భగీరథ నీటి ట్యాంకు నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే భూమి పూజ

author img

By

Published : Nov 16, 2020, 3:32 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తోళ్ల వాగు సమీపంలో మిషన్ భగీరథ నీటి ట్యాంకు నిర్మాణానికి పెద్దపల్లి పార్లమెంట్​ సభ్యుడు వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దివాకర్​ రావు భూమి పూజ చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ పైప్​లైన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు 15 నెలలో అందిస్తున్నామని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందిస్తోందని ఎంపీ వెంకటేశ్​ పేర్కొన్నారు. అందులో భాగంగా మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. భాజపా నాయకులు.. తెరాస ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. ప్రతిపక్షాల తప్పుడు మాటలు తిప్పి కొట్టేలా.. తెలంగాణ సర్కారు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తెలిసేలా తెరాస కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

మిషన్ భగీరథ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​.. కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని కోరితే.. ఇప్పటివరకు స్పందించలేదన్నారు. తెలంగాణ భాజపా ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడకుండా సామాజిక మాధ్యమాల్లో అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి: పట్టణీకరణకు అనుకూలంగా పరిపాలన వికేంద్రీకరణ: కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.