NRI Missing Vote in Mancherial District : పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. వలస వెళ్లిన వారంతా స్వస్థలాలకు తిరిగి రావడంతో బస్సులు, రోడ్లు కిక్కిరిసి పోయాయి. చాలా మంది హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వెళ్లారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు ఓటు హక్కు ఉందో.. లేదని చెక్ చేసుకుని ఉందని నిర్ధారించుకున్నాక ఏకంగా సప్తసాగరాలు దాటి వచ్చాడు.
న్యూజిలాండ్ నుంచి తెలంగాణకు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. పోలింగ్ బూత్ అధికారి జాబితాలో తన ఓటు లేదని చెప్పగానే అవాక్కయ్యాడు. ఇలా ఎందుకు జరిగిందని చూస్తే.. తాను ఓటు ఉందని తెలుసుకున్న జాబితా పాతదని.. కొత్తదాంట్లో తన ఓటు తొలగించారనే విషయం అర్ధమయింది. దీంతో అంత దూరం నుంచి వచ్చినా.. ఓటు వేయలేక పోయానే అని బాధ పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
తెలంగాణలో 70.66% పోలింగ్ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది
Telangana Assembly Elections Polling 2023 : బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ గత 15 సంవత్సరాలుగా న్యూజిలాండ్‌లో నివసిస్తున్నాడు. అక్కడ ఓ కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. ఎన్నికల దృష్ట్యా.. ఓటు హక్కును వినియోగించుకోవాలని.. తల్లిదండ్రులతో కొన్ని రోజులు గడుపుదామని అతని భార్య లావణ్యతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. తన మిత్రుడు ఓటరు జాబితాను వాట్సాప్‌లో పంపగా.. తన పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకున్నాడు.
ఓటర్లతో పోటెత్తిన పల్లెలు-ఉవ్వెత్తున నమోదైన పోలింగ్
NRI Missed Vote in Mancherial : స్నేహితుడు పంపిన ఓటరు జాబితా(Voter List Telangana 2023)లో దంపతులు ఇద్ధరి పేర్లు ఉన్నాయి. గురువారం రోజున ఓటు వేసేందుకు చింతగూడలోని పోలింగ్ బూత్ 296కు వెళ్లగా.. పోలింగ్ అధికారి అక్కడున్న జాబితాలో తన పేరు లేదని తెలిపారు. తన భార్య పేరు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీంతో శ్రీనివాస్ కాసేపు షాక్ గురై.. తేరుకున్నాక.. వాట్సాప్‌లో ఉన్న జాబితాను చూపించాడు.
అనంతరం ఆ జాబితా పాతదని.. సవరించిన జాబితాలో తన పేరు లేదని అధికారులు చెప్పారు. న్యూజిలాండ్ నుంచి భార్యభర్తలిద్దరూ భారత్‌కు రావడానికి విమానం ఛార్జీలు రూ.2.50 లక్షలు అయ్యాయని.. తను ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాడని విచారం వ్యక్తం(NRI Feel Bad Due to Loss Vote) చేశాడు. కాగా మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 75.59 పోలింగ్ శాతం నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 70.66 శాతం నమోదయిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతలు - పోలీసుల లాఠీ ఛార్జీ